కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) తొలి విడత ముగిసిన విషయం తెలిసిందే. తమ పార్టీ మద్దతుదారులే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మేము కూడా గట్టి పోటీ ఇచ్చామని బీఆర్ఎస్ చెబుతోంది. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం తీవ్రస్థాయిలో జరిగిందన్న చర్చ సాగుతోంది. కొన్ని స్థానాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లకు డబ్బు, మద్యం విపరీతంగా పంపిణీ చేశారు.
అయితే ఇప్పుడు కొన్ని చోట్ల పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) ఓడిపోయిన అభ్యర్థులు తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా సోమ్లా తండాలో భూక్యా కౌసల్య అనే మహిళ సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీగా డబ్బులు పంచారు. అయితే తాజాగా ఈమె ఊరంతా తిరిగి తన దగ్గర డబ్బు తీసుకున్న వాళ్లను శాపనార్థాలు పెడుతున్నారంట. తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారంట.
నిందలు, శాపనార్థాలు
పల్లెటూర్లలో పోలింగ్, కౌంటింగ్ అనంతరం వాతావరణం ఎంతో గంభీరంగా ఉంటుంది. సహజంగా ఓడిపోయిన అభ్యర్థులు తీవ్ర అసహనంగా ఉంటారు. ఈ క్రమంలోనే ఓటర్ లిస్ట్ తీసుకొని లెక్కలు వేసుకుంటారు. తమకు ఓటు వేయని వారు ఎవరు? వేసిన వారు ఎవరు? అని అంచనాలు వేసుకుంటారు. ఇక ఓటు వేయలేదని అనుమానించిన వారిపై కక్ష పెంచుకుంటారు. ఇది ప్రతి గ్రామంలోనూ జరిగేదే. తాజాగా అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. తమను మోసం చేశారని.. తమకు ఓటు వేస్తామని నమ్మించి వేయలేదని నిందలు, శాపనార్థాలు అనేక గ్రామాల్లో కనిపిస్తున్నాయి.
Read Also: చిక్కుల్లో దువ్వాడ మాధురి, శ్రీనివాస్.. బర్త్ డే పార్టీ భగ్నం
Follow Us On: Pinterest


