కలం, వెబ్ డెస్క్: ఇవాళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) 75వ పుట్టినరోజు. భారతీయ సినిమాల్లో అత్యంత ప్రతిభవంతమైన నటుల్లో ఒకరు. ట్రేడ్‌మార్క్ మ్యానరిజమ్స్, లుక్స్, ప్రెజెన్స్, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టాయి. 1950 డిసెంబర్ 12న రామోజీ రావు గైక్వాడ్, గృహిణి రమాబాయి దంపతులకు జన్మించారు. రజినీ సినిమా రంగంలోకి ప్రవేశించే ముందు బస్ కండక్టర్‌గా పనిచేశాడు. నటనపై ఆసక్తితో సినిమా వైపు మళ్లాడు. రజినీకాంత్ 1975లో ‘అపూర్వ రాగంగల్’ అనే తమిళ చిత్రంతో తొలిసారిగా నటించారు. ఇది ఉత్తమ తమిళ ఫీచర్ ఫిల్మ్‌తో సహా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు.
రజినీ బర్త్ డే సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) విషెష్ చెప్పారు. ఆయన సినిమాలు తరతరాలను ఆకర్షించాయని ప్రశంసించారు. రజినీ విభిన్న పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయన్నారు. 75 సంవత్సరాల జీవితంలో.. 50 ఏళ్ల అద్భుతమైన కెరీర్ అని రజినీ(Rajinikanth)నీ కొనియాడారు. అలాగే కమల్ హాసన్, ధనుష్‌తో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలు విష్ చేశారు. బస్సు కండక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రజినీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం.
Read Also: అఖండ 2 రివ్యూ
Follow Us On: Instagram


