epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విభేదాలు వీడి కలసి పనిచేయండి : ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: ‘రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలున్నారు. ప్రజల్లో ఆదరణ ఉంది. అయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగానూ ఎదగలేకపోతున్నాం. కారణాలేంటి? రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనకబడింది? ’ అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీల పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. విభేదాలు వీడి, పార్టీ అభివృద్ధికి పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, అండమాన్​లోని 15 మంది బీజేపీ ఎంపీలకు గురువారం ప్రధాని మోదీ బ్రేక్​ ఫాస్ట్​ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ పరిస్థితిని సమీక్షించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో పార్టీ వెనకబాటుపై ఎంపీలకు ప్రధాని మోదీ సీరియస్​ క్లాస్​ తీసుకున్నారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఎనిమిది మందిని ఎంపీలుగా గెలిపించారని, అయినా కనీసం ప్రధాన ప్రతిపక్షంగానూ ఎందుకు ఎదగలేకపోతున్నామని ప్రశ్నించారు. ఈ మేరకు ఆధారాలతో సహా ప్రశ్నిస్తూ, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అన్ని అవకాశాలూ ఉన్నా రాష్ట్రంలో ఎదగలేకపోతున్నామని, ఎంపీల నిర్లక్ష్యంపై ప్రధాని మోదీ (PM Modi) సీరియస్​ అయ్యారు. కాంగ్రెస్​ పాలన వైఫల్యాలను ఎందుకు గట్టిగా నిలయదీయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ సోషల్​ మీడియా పనితీరుపైనా ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసదుద్దీన్​ ఒవైసీ సోషల్​ మీడియా కంటే తెలంగాణ బీజేపీ వెనకబడిందని వ్యాఖ్యానించారు. ఇకనైనా విబేధాలు వీడి, ఉమ్మడిగా పనిచేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలకు హితవు పలికారు. సమస్యలపై ప్రశ్నిస్తూ, పర్యటిస్తూ రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్​ పెరిగేందుకు కృషి చేయాలని సూచించారు.

Read Also: ఇంటెలిజెన్స్ ప్రభాకర్‌రావుకు పోలీస్ కస్టడీ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>