epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

లోడ్‌తో దిగితే బ్యాటరీ ఫుల్.. చైనా ట్రక్కులకు కొత్త టెక్నాలజీ

కలం, వెబ్ డెస్క్ : టెక్నాలజీ రంగంలో చైనా (China) దూసుకెళ్తోంది. ఎవ్వరికీ సాధ్యం కానీ వాటిని తయారు చేస్తూ అబ్బురపరుస్తోంది. ఇప్పుడు చైనాలోని ఓపెన్ – పిట్ మైనింగ్ లో రంగంలో వినూత్న టెక్నాలజీని ప్రవేశపెట్టింది. మైనింగ్ లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ ట్రక్కులు (Electric Trucks) ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ట్రక్కులు కొండ దిగేటప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ (Regenerative) సాయంతో కైనెటిక్ ఎనర్జీ (Kinetic Energy)ని బ్యాటరీల్లో స్టోర్ చేసుకుంటాయి. ఈ విధానంతో ఈవీ ట్రక్కులకు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం తక్కువగా ఉంటోంది. దీంతో డీజిల్ ట్రక్కులతో పోలిస్తే ఇంధన ఖర్చుల విషయంలో భారీగా ఆదా అవుతోంది.

ఈ కొత్త టెక్నాలజీ (China Electric Trucks) వల్ల ప్రతి సంవత్సరం సుమారు రూ.13 కోట్లు ఇంధన ఖర్చు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చైనాలో ప్రముఖ కంపెనీలు అయిన Yutong, XCMG వంటి సంస్థలు ఈ వినూత్న టెక్నాలజీని ఉపయోగించి వందలాది ట్రక్కులను నడుపుతున్నాయి. వీటితో పర్యావరణానికి అనుకూలంగా ఉండడం, ఆపరేటివ్ ఖర్చులను తగ్గించడం వల్ల భవిష్యత్తులో ఈ ట్రక్కులు మైనింగ్ రంగంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: IPL 2026లో భారీ ధర పలికే ఇండియా యంగ్ ఆటగాళ్లు ఎవరంటే..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>