కలం, వెబ్‌డెస్క్: నటుడు అజిత్‌కుమార్ (Ajith Kumar) కు రేసింగ్‌పై ఉన్న ఫ్యాషన్ తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు బైక్ రేసింగ్‌లో స్వయంగా పాల్గొన్న ఆయన ఇప్పుడు కార్ రేసర్‌గా బరిలోకి దిగనున్నారు. మలేషియాలోని సెపాంగ్‌లో జరగనున్న ఏషియన్ లీ మాన్స్ సిరీస్(ఏఎల్ఎంఎస్) ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రఖ్యాత ఎఫ్1 రేసర్, మనదేశానికే చెందిన నరైన్ కార్తికేయన్‌తో కలసి పోటీలో పాల్గొంటారు. ఈ నెల 13, 14న రెండ్రోజుల పాటు ఏఎల్ఎంఎస్ సిరీస్ పోటీలు జరుగుతాయి. ఇందులో అజిత్‌కు చెందిన ‘అజిత్‌కుమార్ రేసింగ్’ జట్టు ‘టు కార్ ఎంట్రీ’ ఇవ్వనుంది. అంటే అజిత్ టీమ్ తరఫున రెండు కార్లు పోటీలో ఉంటాయి.
మొదటి కార్కు అజిత్ (Ajith Kumar), కార్తికేయన్‌తోపాటు మరో డ్రైవర్ జులియన్ గెర్బి ఉంటారు. రెండో కార్కు ఆదిత్య పటేల్, రొమైన్ వోజ్నియక్ డ్రైవర్లుగా వ్యవహరిస్తారు. ఇవి ఎండ్యూరెన్స్ పోటీలు. ఇందులో కొన్ని లాప్స్ తర్వాత డ్రైవర్ మారుతుంటారు. ఆ ప్రకారం కొన్ని లాప్స్ వరకు అజిత్ కార్‌ను స్వయంగా నడపనున్నారు. రేసింగ్‌లో భాగంగా ప్రస్తుతం క్వాలిఫయర్స్ జరుగుతున్నాయి. వీటి కోసం అజిత్ మలేషియాకు రావడతో ఆయన్ని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. కాగా, ఇటీవలే ఆజిత్ టీమ్ దుబాయ్ మోటో జీపీ రేస్‌లో మూడో స్థానంలో నిలిచింది.
Read Also: మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు.. వారికి మాత్రమే ఛాన్స్
Follow Us On: X(Twitter)


