కలం, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో భారీ మోసం (TTD Scam) జరిగిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యి, పరకామణి వివాదాలు ముగిసిపోకముందే శాలువాల స్కాం బయటపడింది. సిల్స్ శాలువాలకు బదులుగా పాలిస్టల్ శాలువాలు సరఫరా చేసి తెలుస్తోంది. దీంతో మరోసారి టీటీడీ వ్యవహారశైలి చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ‘టీటీడీలో శాలువాల స్కాంని బయటపెట్టింది నేనే’ అంటూ ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
TTD Scam | తిరుపతిలో శాలువ కొనడానికి వెళ్లిన సమయంలో తనకు అనుమానం వచ్చిందని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబెర్ జ్యోతుల నెహ్రూ (MLA Jyothula Nehru) అన్నారు. కొండపై రూ.1334లకు కొన్న శాలువాను కింద దుకాణాల్లో అడిగితే రూ.600 అని చెప్పారన్నారు. విషయం తెలియగానే కొనుగోళ్లు ఆపేశామని, బోర్డు సమావేశంలో చర్చించి విచారణకు ఆదేశించామని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈనెల 14న జరగబోయే మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని, దేవుడి సొమ్ము వృథా కాకూడదు జ్యోతుల నెహ్రూ అన్నారు.
Read Also: గ్యారేజ్ నుండి గ్లోబల్ దిగ్గజం వరకు.. గూగుల్ విజయగాథ
Follow Us On: Instagram


