కలం, వెబ్ డెస్క్ : తల్లిదండ్రుల మధ్య పడుకోబెట్టడంతో 26 రోజుల పసికందు (Infant) చనిపోయిన విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం (Uttara Pradesh) అమ్రోహ జిల్లాలోని గుజ్రాలా ప్రాంతంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సద్దాం అబ్బాసి, అస్మా దంపతులకు నవంబర్ 10న సుఫ్యాన్ అనే బాబు జన్మించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి శిశువుని తల్లిదండ్రుల మధ్యన పెట్టుకుని పడుకున్నారు. అయితే, ఊపిరాడక సుఫ్యాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఆదివారం ఉదయం శిశువు (Infant) కళ్లు తెరవకపోవడంతో సద్దాం వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే శిశువు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పుట్టినప్పటి నుంచే శిశువు బలహీనంగా ఉన్నాడని, శ్వాస తీసుకోవడంలో సమస్యలతో పాటు కామెర్లతో బాధపడుతున్నాడని బంధువులు తెలిపారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.
Read Also: మహేష్ మరో మల్టీప్లెక్స్.. హకీంపేటలో AMB
Follow Us On: Youtube


