హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్‌టీఆర్(NTR)తో మల్టీస్టారర్‌గా వచ్చిన మూవీ ‘వార్-2’. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రానించలేకపోయింది. ఆకాశాన్నంటే ఎగ్జైట్‌మెంట్‌తో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉంది అంటే మాత్రం.. పెదవి విరుపుతో సమాధానం ఇచ్చారు. ఈ సినిమా పర్ఫార్మెన్స్‌పై తాజాగా హృతిక్ రోషన్ పెదవి విప్పాడు. తాను చేయాల్సింది, చేయగలిగిందంతా చేశానని చెప్పాడు. హృతిక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తాను మెయిన్ రోల్‌లో చేసిన సినిమా రిజల్ట్ విషయంలో హృతిక్ చేతులెత్తేస్తున్నాడేంటి? అని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు హృతిక్ ఏమన్నాడంటే..
‘‘సినిమా షూటింగ్ మొత్తం చాలా సరదాగా పూర్తి చేశాం. కబీర్ పాత్రలో నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఈ ప్రాజెక్ట్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఈజీ అనిపించింది. నేను ఎవరికయినా ఒకటే చెప్తా.. దేనిని అయినా తేలికగా తీసుకోమని. అది రివార్డ్ అయినా విమర్శ అయినా. ఈ సినిమాకు ఒక నటుడిగా నా 100 శాతం ఇచ్చాను. నేను చేయాల్సింది నేను చేశా. దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా చాలా బాగా చూసుకున్నారు. షూటింగ్ జరిగినంత కాలం ఆయన ఉత్సాహం మాలో కూడా ఎగ్జైట్‌మెంట్‌ను నింపింది. ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చిత్రీకరించాం. ప్రతి సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతోనే చేస్తాం. కానీ కొన్ని కొన్ని అనుకున్న ఫలితాలు ఇవ్వవు’’ అని హృతిక్(Hrithik Roshan) చెప్పాడు.

