కలం, వెబ్ డెస్క్: తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రికి (Yadadri) భక్తుల తాకిడి పెరిగిపోతోంది. నరసింహుడి స్వామిని దర్శనం కోసం రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో భక్తుల రద్దీతో యాదాద్రిలో ఎక్కడా లేని సందడి ఉంటుంది. రికార్డుస్థాయిలో భక్తులు గుట్టకు తరలివస్తున్నారు. నరసింహ స్వామిని దర్శించుకోలేని భక్తులకు ఆలయ అధికారుల గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తక్కువ సంఖ్యలో గుట్టుకు వస్తున్న జిల్లాలకు స్వామి దర్శనం కల్పించబోతున్నారు.
భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రచార రథం ద్వారా శ్రీస్వామి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 20న భూపాలపల్లి, 27న నాగర్కర్నూల్ జిల్లాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, ఇతర పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయనున్నారు.
నరసింహ స్వామి భక్తుల చెంతకు రావడం అనేది ఆయన కష్టాలను తీర్చే దేవుడని, వారిని రక్షించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని తెలియజేస్తుంది. యాదాద్రి (Yadadri) లాంటి ఆలయాలు ఉత్సవాల రూపంలో స్వామిని గ్రామాల్లోకి తీసుకువెళ్తుంటాయి. అలాగే అహోబిలంలో కూడా జ్వాలా నరసింహ స్వామి, ప్రహ్లాద వరదుడు భక్తుల వద్దకు వస్తారు. ఇది భక్తులకు ఆశీర్వాదం అందిస్తుంది.
Read Also: గ్రేటర్ హైదరాబాద్ మరింత గ్రేటర్.. 300 వార్డులతో కొత్త రూపం
Follow Us On: X(Twitter)


