కలం డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లోని వార్డుల సంఖ్య 300కు పెరిగింది. ప్రస్తుతం 150 డివిజన్లు మాత్రమే ఉండగా శివారు ప్రాంతాల్లోని 20 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇటీవల విలీనం కావడంతో డివిజన్ల సంఖ్య డబుల్ అయింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు చెందిన మున్సిపల్ బాడీలు విలీనం కావడంతో విస్తీర్ణం సైతం 625 చ.కి.మీ. నుంచి 1942.73 చ.కి.మీ.కు పెరిగింది.
ఈ విలీనం అనంతరం GHMC పరిపాలనా వ్యవస్థలో చేయాల్సిన మార్పులు చేర్పులపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) స్టడీ చేసి ‘వార్డ్ రీఆర్గనైజేషన్ ఫర్ జీహెచ్ఎంసీ’ అనే పేరుతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి… ఈ నివేదికకు అనుగుణంగా జీహెచ్ఎంసీలో ఇకపైన 300 డివిజన్లు ఉండేలా నోటిఫికేషన్ జారీచేయాలని GHMC కమిషనర్‌కు సూచించారు.
Read Also: మద్దూకూరు రైతు అదిరిపోయే ఆలోచన.. కలెక్టర్ జితేష్ ప్రశంసల జల్లు!
Follow Us On: Instagram


