కలం, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో నరసింహ సినిమా (Narasimha Movie) ఒక మైల్ స్టోన్. బ్లాక్ బస్టర్ సినిమాల్లో అది కూడా ఒకటి. డిసెంబర్ 12న రజినీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా రజినీకాంత్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి నరసింహకు సీక్వెల్ (Narasimha Sequel) ప్లాన్ చేస్తున్నామని ప్రకటించాడు. దానికి ‘నీలాంబరి’ పేరు పెట్టినట్టు తెలిపాడు. నరసింహ సినిమా లో నీలాంబరి పాత్రను రమ్యకృష్ణ చేసింది. మూవీ క్లైమాక్స్ లోనే ఆ పాత్ర చనిపోయింది. ఇప్పుడు డౌట్ ఏంటంటే చనిపోయిన నీలాంబరి పాత్రతో మూవీ ఏంటనేది. సినిమాలో నీలాంబరి పాత్ర చాలా పవర్ ఫుల్. సినిమాకే హైలెట్.
ఇన్నేళ్లు అయినా ఆ పాత్రపై ఏదో ఒక మీమ్ కనిపిస్తూనే ఉంది. జనాల్లో ఆ పాత్రకు ఉన్న క్రేజ్ వల్ల నరసింహ సీక్వెల్ (Narasimha Sequel) చేస్తున్నారు ఓకే. బట్ నీలాంబరి పాత్రను ఎలా బతికిస్తారు. పోనీ ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది చూపిస్తారా. అలా చేయాలంటే సౌందర్య బతికి లేదు కాబట్టి ఆమె చేసిన వసుంధర పాత్రకు ముగింపు పలకాలి. పైగా రజినీ, రమ్యకృష్ణ ఆ పాత్రలు చేస్తే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారా.. ఎందుకంటే వారికి వయసు అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ తో మూవీ చేస్తే యంగ్ గానే కనిపించాలి కదా. అదెలా సాధ్యం అవుతుంది. ఒకవేళ నీలాంబరిగా వేరే యంగ్ హీరోయిన్ ను తీసుకుంటే కష్టం. ఎందుకంటే నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణను తప్ప ఇంకెవరినీ ప్రేక్షకులు ఊహించుకోలేరు.
ఇవేవీ కాకుండా బంగార్రాజు పాత్రను డిజైన్ చేసినట్టు.. కేవలం నీలాంబరి పాత్రతోనే ఓ సినిమాను తీసేస్తారా అనేది కూడా సస్పెన్స్. ప్రస్తుతం కథలు రెడీ చేస్తున్నామని రజినీకాంత్ అన్నారు. రజినీకాంత్ గతంలోనూ కొన్ని సినిమాలకు సీక్వెల్స్ చేశారు గానీ అవి పట్టాలెక్కలేదు. ఈ నరసింహాకు సీక్వెల్ చేసే అవకాశాలే కనిపించట్లేదు కాబట్టి దీన్ని నిజంగానే చేస్తాడా లేదంటే ప్రకటన వరకే ఆపేస్తారా అనేది చూద్దాం.
Read Also: వర్చువల్ కిడ్నాపింగ్తో జాగ్రత్త : అమెరికా
Follow Us On: Youtube


