epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఫ్యూచర్ సిటీలో ట్రంప్ గ్రూప్ ఇన్వెస్ట్ మెంట్స్

కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ (Future City)లో ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూపు (Trump Media Technology Group) 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ (MoU) కుదుర్చుకున్నది. నెక్స్ జెనరేషన్ స్మార్ట్ సిటీ, ఇంటెలిజెన్స్ సిటీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Digital Infra), ఏఐ ఆధారిత సేవలు, మీడియా టెక్నాలజీ, ఫ్యూచర్-రెడీ (Future-Ready) తదితరాలను నెలకొల్పనున్నది. పట్టణ పరిపాలనలో అవసరమైన సర్వీసులను కూడా అందించనున్నది. గ్రూపు అడ్వైజర్లు రూబిడెక్స్, రేనాటస్ సహా ఇండియా యూనిట్ భాగస్వామిగా ఉన్న కనుమూరి రాజు ఈ ఒప్పందాన్ని ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు.

ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం :

ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూపు (Trump Media Technology Group)తో కుదిరిన ఒప్పందం మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో అవసరమైన అన్ని రకాల అనుమతులు సకాలంలో వచ్చేలా చూస్తామని భరోసా కల్పించారు. ఈ ఒప్పందం ద్వారా టెక్నాలజీ, మీడియా రంగాల్లో మాత్రమే కాకుండా పట్టణ అభివృద్ధి, అంతర్జాతీయ సంబంధాలు, డిజిటల్ ఇన్నోవేషన్ తదితర రంగాల్లోనూ ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎంవోయూ ద్వారా పట్టణాభివృద్ధికి అవసరమైన నూతన టెక్నాలజీ సాకారమవుతుందన్నారు. తెలంగాణ భవిష్యత్ ప్రయాణానికి ఈ ఒప్పందం ఒక మైలురాయి వంటిదన్నారు.

Read Also: ప్రతీకా రావల్‌కు రూ.1.5కోట్ల బహుమతి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>