Kibబంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan)మరోసారి జాతీయ జట్టులో అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత సంవత్సరం టెస్ట్, టీ20 ఫార్మాట్‌లకు ప్రకటించిన తన రిటైర్మెంట్‌ను చేసుకుంటున్నట్లు తాజాగా వెల్లడించాడు. తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్న షకీబ్.. “నేను అధికారికంగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కాలేదు. ఇది మొదటిసారి మాట్లాడుతున్న నిజం. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి వన్డే, టెస్ట్, టీ20 పూర్తి సిరీస్‌లు ఆడి… తర్వాతే రిటైరవ్వాలనుకుంటున్నా” అని వ్యాఖ్యానించాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మారడంతో షకీబ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. అవామీ లీగ్ పార్టీ మాజీ ఎంపీగా ఉన్న అతడిపై ఒక హత్య కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో, మే 2024 నుంచి అతడు స్వదేశానికి తిరిగి వెళ్లలేదు. ఈ సమయంలో కూడా షకీబ్ అంతర్జాతీయ క్రికెట్‌ను కొనసాగించాడు. పాకిస్థాన్, భారత్ పర్యటనల్లో టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్నాడు. షకీబ్(Shakib Al Hasan)నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అతని అనుభవం జట్టుకు అవసరం అని కొంతమంది భావిస్తుండగా, మరికొందరు రాజకీయ వివాదాల మధ్య అతడు తిరిగి రావడాన్ని ప్రశ్నిస్తున్నారు.
Read Also: ప్రతీకా రావల్‌కు రూ.1.5కోట్ల బహుమతి
Follow Us On: X(Twitter)


