టీమిండియా మహిళ క్రికెటర్ ప్రతీకా రావల్(Pratika Rawal)కు ఢిల్లీ ప్రభుత్వం భారీ బహుమతి అందించింది. వన్డే వరల్డ్ కప్-2025లో ప్రతీక కనబరిచన అద్భుత ప్రదర్శనకు ఈ బహుమతి ప్రకటించింది. ఆమె ప్రతిభ, కృషిని గుర్తించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్త నిర్ణయం మేరకు రూ. 1.5 కోట్లు రివార్డ్‌గా అందించారు. ఈ విషయాన్ని రేఖా గుప్తా తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. “ప్రతీకా రావల్ ఢిల్లీ యువ శక్తికి ప్రతీక. ఆమె ధైర్యం, పట్టుదల, భారత మహిళా శక్తి ఎదుగుదలకు అద్దం. ఢిల్లీ కలలకు ఆమె ప్రయాణం రెక్కలు తొడిగింది” అని రేఖా రాసుకొచ్చారు.
వరల్డ్‌కప్‌లో ప్రతీకా రావల్(Pratika Rawal) బ్యాటింగ్‌లో రాణించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధానాతో కలిసి కీలక సందర్భాల్లో బలమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 305 పరుగులు చేసి, అత్యధిక రన్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. అయితే సెమీఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఆమె గాయపడింది. ఆ తర్వాత అమన్ జ్యోత్ కౌర్ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చి ప్రతీకా స్థానాన్ని భర్తీ చేసింది.
Read Also: స్టార్‌లింక్ రెసిడెన్షియల్ ప్లాన్ రూ.8,600
Follow Us On: Instagram


