epaper
Tuesday, November 18, 2025
epaper

Auto Driverla Sevalo | ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్… ఖాతాల్లో డబ్బు జమ

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని అమలు చేసింది. “ఆటో డ్రైవర్ల సేవలో(Auto Driverla Sevalo)” పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం లాంచ్ చేశారు. పథకం ప్రారంభించిన వెంటనే అర్హులైన డ్రైవర్ల ఖాతాల్లో రూ.15,000 జమ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన సుమారు 2.90 లక్షల మంది డ్రైవర్లకు “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. ఈ స్కీమ్ లో భాగంగా ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.

కాగా, ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఇతర నాయకులు. అంతకంటే ముందు వీరంతా ఆటోల్లో ప్రయాణించి ఉండవల్లి నుంచి సింగ్ నగర్ చేరుకున్నారు. కార్యక్రమంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విజయవాడ ఉత్సవ్ బ్రహ్మాండంగా జరిగింది, ఓజి సినిమా చూశారు, దసరా పండుగ చేసు కున్నారు. ఇవాళ ఆటో డ్రైవర్ల పండుగలో ఉన్నాము. ఏ కార్యాలయానికి తిరగకుండా ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు

Auto Driverla Sevalo
Auto Driverla Sevalo

ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి.. ఆటో డ్రైవర్లందరికీ రూ. 15 వేలు ఖాతాల్లో జమ చేశాం.. ఆటో డ్రైవర్లకు ఇది నిజమైన పండగ.. ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. ఆన్‌లైన్‌లోనే డబ్బులు జమ అవుతాయి.. చెప్పినట్లు చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.. గతంలో రోడ్ల పరిస్థితుల కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం అంతా వాహనాల మరమ్మతులకే ఖర్చయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: ప్రేమించి చేసుకున్న పెళ్లి.. వారానికే వధువు కఠిన నిర్ణయం

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>