Mobile Popup Ad
Mobile Popup Ad

జనసేన ఆఫీస్‌ ముందు కాపు నేతల ఆందోళన.. ఎందుకంటే?

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలోని జ‌న‌సేన (Janasena) కార్యాల‌యం ముందు కాపు సామాజికవ‌ర్గ‌ నేత‌లు ఆందోళ‌నకు (Kapu Leaders Protest) దిగారు. కూట‌మి ప్ర‌భుత్వం కాపు కార్పొరేష‌న్‌కు హామీ ఇచ్చిన ప్ర‌కారం నిధులు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఏటా రూ.3000 కోట్ల చొప్పున రెండేళ్ల‌కు రూ.6000 కోట్లు విడుద‌ల చేయాల‌న్నారు. అలాగే కాపు కార్పొరేష‌న్ విదేశీ విద్యా దీవెన‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.90 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ అంశాల‌పై సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్య‌క్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జ‌న‌సేన ఆఫీస్‌కు చేరుకొని నిర‌స‌న‌కారుల్ని అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

Read Also: మిడ్ డే మీల్స్‌లో బ‌ల్లి.. స్కూల్‌లో పేరెంట్స్ ఆందోళ‌న‌!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>