పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా నేడు కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగిన వేళ దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల రానున్న రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ఆవేదన చెందున్నారు. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధరలు పెరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు చెక్ పెడుతూ కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో చమురు ధరలను పెంచే (Fuel Price Hike) ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పెట్రోలియం జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ (Sujata Sharma) ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులపై భారం పడకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండు నెలలకు సరిపడా పెట్రో నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ప్రభావం కేవలం వ్యాపార వర్గాలకే పరిమితం అవుతుందని, సాధారణ గృహ వినియోగదారులపై దీని భారం ఉండబోదని తేల్చి చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెంచబోమని (Fuel Price Hike) చెప్పుకొచ్చారు.

దేశంలో ఎక్కడా పెట్రోల్-డీజిల్ అందకపోవడం (డ్రై అవుట్) అనేది లేదని, దేశంలోని రిఫైనరీలు అత్యధిక స్థాయిలో పని చేస్తున్నాయని ఆమె చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని గుర్తు చేశారు. దేశంలో చమురు సరఫరాపై వాహనదారులు ఆందోళన చెందవద్దని సూచించారు.

Read Also: కర్ణాటకలో బస్సు భీభత్సం.. రెండేళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>