Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్ – ఇజ్రాయెల్​ యుద్ధం.. తెలంగాణ అసెంబ్లీలో కీలక తీర్మానం

కలం, వెబ్​ డెస్క్​ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ (Assembly) లో  కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇరాన్​ – ఇజ్రాయెల్ (Iran – Israel)​ యుద్ధం ఆపడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రయిల్ మధ్య మొదలైన యుద్ధం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనంపై అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయన్నారు. ముడిచమురు ఉత్పత్తి, రవాణా ఈ యుద్ధ ప్రభావానికి లోనై సరఫరాలో ప్రభావం చూపిస్తోందన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్​ కలిసి.. ఇరాన్​, లెబనాన్​ మీద దాడి చేస్తే.. ఇరాన్ గల్ఫ్​ దేశాల్లో ఉన్న అమెరికా డిఫెన్స్​ స్థావరాలపై విరుచుకుపడుతోందన్నారు. ఈ ఉద్రిక్తతల్లో దాదాపు 4000మంది అమాయకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మరణాలతో పాటు ఆర్థిక విధ్వంసం జరుగుతోందన్నారు. మరణాలు ఆయా దేశాలకు పరిమితమైతే, ఆర్థిక విధ్వంసం మాత్రం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా ఆసియా దేశాలతో పాటు భారత్​ పై ఈ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారిందని ఆందోళ వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని ఆపకపోతే ప్రపంచ భవిష్యత్తు ఆందోళనకంరగా మారుతుందన్నారు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని.. ఇది ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పు అని చెప్పారు. ఇలాంటి అత్యంత ప్రమాదకర పర్యవసనాల దృష్ట్యా భారత ప్రభుత్వం యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి తగిన చొరవ తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి కోరుతూ అసెంబ్లీలో (Assembly) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Read Also: కాంట్రవర్సీ కౌశిక్​.. ఫ్యూచర్ ఏంటి?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>