స్టేషన్ లోనే ఏసీబీ స్కెచ్.. అడ్డంగా దొరికిపోయిన ఎస్సై!

కలం, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (Thimmajipet SI) హరిప్రసాద్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇసుక రవాణాకు సంబంధించిన కేసులో పట్టుబడిన వాహనాలను విడుదల చేసేందుకు ఆయన లంచం డిమాండ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇప్పటికే మైనింగ్ విభాగానికి సంబంధించి రూ.60 వేల జరిమానా చెల్లించినప్పటికీ, వాహనాలను వదిలేందుకు ఎస్సై అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేశారు.

ఎస్సై వేధింపులు భరించలేకపోయిన బాధితుడు, ఆయనతో జరిగిన సంభాషణలను వాయిస్ రికార్డింగ్ చేసి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం పోలీస్ స్టేషన్‌లోనే ఏసీబీ అధికారులు ట్రాప్ ఆపరేషన్ నిర్వహించారు. బాధితుడి నుండి రూ.20 వేల నగదు తీసుకుంటుండగా ఎస్సై (Thimmajipet SI) హరిప్రసాద్ రెడ్డిని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ బృందం, తదుపరి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంది.

Read Also: కాంట్రవర్సీ కౌశిక్​.. ఫ్యూచర్ ఏంటి?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>