కలం, వెబ్‌డెస్క్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. భారత్ కు వచ్చి, వెళ్లే వరకు మీడియాతో పాటు దేశంలోని ప్రజలు పుతిన్ కు సంబంధించి ప్రతి విషయంలోనూ ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచ దేశాధ్యక్షుల్లో పుతిన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన చిన్న విషయం కూడా అంతర్జాతీయంగా మీడియా కవర్ చేస్తూ ఉంటుంది. భారత్ పర్యటన వేళ పుతిన్ ఫిట్నెస్ సీక్రెట్స్ (Putin Fitness Secrets), ఆహార నియమాలపై చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఆయనకి 73 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎంతో ఫిట్‌గా కనిపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం పుతిన్ పాటించే డైట్ ఒకటైతే, ఎక్సర్ సైజ్ మరొక కారణం. అసలు ఆయన పాటించే డైట్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్..
రష్యా కథనాల ప్రకారం.. పుతిన్ డైట్ (Putin Diet)లో బ్రేక్ ఫాస్ట్ అతిముఖ్యమైనది. పుతిన్ బ్రేక్ ఫాస్ట్ లో తూర్పు యూరప్ సాంప్రదాయ వంటకం అయిన త్వొరోగ్ తప్పక ఉండాల్సిందేనట. దీన్ని తాజా చీజ్ తో తయారు చేస్తారు. దీంతో పాటు క్వయిల్ అనే పక్షి పచ్చి గుడ్లు, బీట్రూట్ జ్యూస్ బ్రేక్ ఫాస్టులో భాగంగా ఉంటుంది. అలాగే, తీపిపదర్థాలకు పుతిన్ దూరంగా ఉంటారు. వీటిని తినకూడదని ఆయన రూల్ పెట్టుకున్నారట. చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగిస్తారు.
లంచ్‌లో వెజిటబుల్స్, చేపలకు ప్రయారిటీ
పుతిన్ లంచ్ లో వెజిటబుల్స్ ప్రధాన భాగం. టమటా, దోసకాయ, సలాడ్ ఇందులో ఉంటాయి. పుతిన్ మాంసం కంటే చేపలకు ప్రయారిటీ ఇస్తారు. అలాగే, గొర్రెమాంసాన్ని కూడా ఇష్టంగా తింటారంట. రైస్, గొధుమ పిండితో చేసిన వాటికంటే ఓట్స్ ఎక్కువగా ఆహారంలో భాగంగా ఉంటుంది. పుతిన్ మధ్యాహ్న భోజనం ఆయన షెడ్యూల్ ప్రకారం మారుతూ ఉంటుంది. ఒకవేళ బిజీగా ఉంటే పండు లేదా ఒక గ్లాస్ కెఫిర్, పాలు తాగుతారు.
లైట్ డిన్నర్…
పుతిన్ డైట్ లో ఆశ్యర్యకరమైన విషయం కూడా ఉంది. ఆయన రాత్రి భోజనాన్ని తరచూ దాటవేస్తారు. ఇంట్లో ఉన్నా లేదా విదేశీ పర్యటనల సమయంలోనైనా పుతిన్ ఈవినింగ్ భోజనాన్ని తక్కువగా తినడానికి ఇష్టపడుతారు. అలాగే, ఆయన ప్రయాణిస్తున్నప్పుడు, తాను సందర్శించే దేశంలోని స్థానిక వంటకాలను తినడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పటికీ తక్కువ మోతాదులో భోజనం చేస్తారు. దీంతో పాటు పుతిన్ కు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. దీంతో 73 ఏళ్లలోనూ పుతిన్ ఫిట్ గా కనిపిస్తారు.
Read Also: ఇండిగో సమస్యకు సొల్యుషన్ చెప్పిన CPI నారాయణ
Follow Us On: Youtube


