కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్(BRS) విపరీతంగా ప్రయత్నిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే హిల్ట్ పాలసీ(Hilt Policy)పై ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని భావించింది. బీఆర్ఎస్ నేతల పారిశ్రామిక వాడలున్న ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ కు తెరలేపిందని విమర్శించారు. అయితే ఈ స్కామ్ విషయంలో ప్రజల నుంచి పెద్దగా స్పందన వచ్చినట్టు కనిపించలేదు. కానీ రాష్ట్రంలో హిల్ట్ పాలసీ అంశం చర్చనీయాంశం అయ్యింది.
తాజాగా బీఆర్ఎస్(BRS) బీసీ అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నది. సాయి ఈశ్వర్ అనే యువకుడు బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసుకున్నాడు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడం వల్లే సాయి ఈశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నది. కేటీఆర్ తీరు వల్లే పార్టీ ఓడిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్కు నాయకత్వ లక్షణాలు లేవని.. ఆయనను ముందుకు పెట్టి పార్టీని నడిపిస్తూ మనుగడ కష్టమేనన్న చర్చ సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్కు తాను సమర్థుడినని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే హిల్ట్ పాలసీ, బీసీ రిజర్వేషన్ల అంశం ఇలా అందివచ్చిన అవకాశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ప్రజలు ఆయన ఎంత మేర నమ్ముతారు అన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.
Read Also: ఇండిగో సంక్షోభం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
Follow Us On: Pinterest


