epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ధరలు పెంచితే చర్యలు తప్పవ్… ఎయిర్‌లైన్స్ కి కేంద్రం వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : ‘ఇండిగో’ (Indigo) విమాన సర్వీసులకు అంతరాయం కలిగిన నేపథ్యంలో పలు ఎయిర్‌లైన్స్ కంపెనీలు టికెట్ ధరలను అమాంతం పెంచేయడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. విపక్ష పార్టీల నేతలు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పౌర విమానయాన మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది.

ప్రయాణికుల కష్టాలను, ఇబ్బందులను సొమ్ము చేసుకోడానికి అనుమతించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. నిర్దిష్ట శ్లాబ్‌ల మేరకే టికెట్ ధరలను నియంత్రించాలని, ఇష్టారాజ్యంగా పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. Indigo ఇబ్బందులను సాకుగా చూపి విచ్చలవిడిగా టికెట్ ధరలను పెంచరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. టికెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామని, ఎయిర్‌లైన్స్ సంస్థలతో పాటు ఆన్‌లైన్ ద్వారా విక్రయించే ధరలను రియల్ టైమ్ బేసిస్‌లో తనిఖీ చేయడానికి ప్రత్యేక మెకానిజంను ఏర్పాటు చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. టికెట్ ధరలను పెంచడంతో విద్యార్థులు, ఆపదలో ఉన్న పేషెంట్లు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నారని ఉదహరించింది.

Read Also: ఇండియాకు S-500 ఇచ్చిన పుతిన్.. వణుకుతున్న వెస్ట్ దేశాలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>