కలం, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో సమానత్వం మీద తరచూ గొంతెత్తుతోన్న యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi Kapoor) కి హాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మద్దతుగా నిలిచింది. మొన్న ఓ పాడ్ కాస్ట్ లో జాన్వీ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో పురుషాధిపత్యం ఎక్కువైందని.. పురుష అహంకారాన్ని తట్టుకుని తాను ఇండస్ట్రీలో నిలబడ్డానని చెప్పింది. మహిళలకు సినిమా ఇండస్ట్రీలో సమానత్వం లేదని సంచలన కామెంట్లు చేసింది. ‘వీ ది విమెన్ ఆసియా’ ప్రోగ్రామ్ లో జాన్వీ మాట్లాడుతూ.. తాను మహిళగా పుట్టినందుకు గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపింది. మహిళల హక్కులు, సమానత్వం మీద అందరూ మాట్లాడాలి. లేదంటే రాబోయే తరంలోనూ అసమానత్వమే కంటిన్యూ అవుతుంది. ఒక మహిళగా జన్మించినందుకు ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలని తెలిపింది జాన్వీకపూర్.
ఈ క్రమంలో జాన్వీ మాట్లాడిన వీడియోను ప్రియాంక చోప్రా (Priyanka Chopra) షేర్ చేస్తూ… ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి అంటూ రాసుకొచ్చింది. ఇంకేముంది ప్రియాంక పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. గతంలోనూ బాలీవుడ్ లో పురుషుల ఆధిపత్యంపై ప్రియాంక చోప్రా గొంతెత్తింది. హాలీవుడ్ లో ఎన్నో స్టేజిల మీద మహిళల గౌరవం, హక్కుల గురించి మాట్లాడిన చరిత్ర ప్రియాంక చోప్రాకే ఉంది. అందుకే జాన్వీ అలా మాట్లాడుతుంటే ప్రియాంక సపోర్ట్ చేస్తోంది. ప్రస్తుతం జాన్వీకపూర్, ప్రియాంక తెలుగు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. జాన్వీకపూర్ రామ్ చరణ్ పెద్ది మూవీలో నటిస్తోంది. అటు ప్రియాంక చోప్రా వారణాసిలో చేస్తోంది. వీరిద్దరూ తెలుగు సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Read Also: జపాన్ లో ప్రభాస్ సందడి.. రాజమౌళి ఏమన్నాడంటే..?
Follow US on: Pinterest


