epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే -రామ్మోహన్​ నాయుడు

కలం, వెబ్​ డెస్క్​: విమాన ప్రయాణికులను ఇండిగో సంక్షోభం అవస్థలపాలు చేస్తున్నవేళ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు (Ram Mohan Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యకు ఇండిగో యాజమాన్యమే కారణమన్నారు. ఆ సంస్థ యాజమాన్యం నిర్వహణ సరిగా లేకపోవడంతోనే సమస్య తలెత్తిందని చెప్పారు. దీనిపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు మూల్యం చెల్లించాల్సిదేనని స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందించారు.

“పైలెట్ల విధులు, విశ్రాంతి, విమానాల రాకపోకల షెడ్యూళ్లపై డీజీసీఏ రూపొందించిన ఫ్టైట్​ డ్యూటీ టైమ్​ లిమిటేషన్ ​(ఎఫ్​ డీటీఎల్​) నిబంధనలు నవంబర్​ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటిని ఎయిర్​ ఇండియా, స్పైస్​ జెట్​ సహా తదితర అన్ని విమానయాన సంస్థలు సక్రమంగా అమలు చేస్తున్నాయి. వాటిలో ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఇండిగో(Indigo)లో మాత్రమే సమస్య వచ్చింది. దీనికి కారణం సంస్థ బాధ్యతారాహిత్యమే. ఎఫ్​ డీటీఎల్​ నిబంధనలను అమలు చేయడంలో సరిగా వ్యవహరించకపోవడం వల్ల ప్రస్తుత సంక్షోభం తలెత్తింది. ఇండిగోలో మాత్రమే ఈ సమస్య తలెత్తినప్పటికీ మూల కారణం కనుక్కోవడానిక కమిటీ నియమించాం. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించాల్సిందే” అని రామ్మోహన్​ నాయుడు (Ram Mohan Naidu) స్పష్టం చేశారు. కాగా, ఇండిగో సమస్య పరిష్కరించడానికి డీజీసీఏ 48 గంటల సమయాన్ని ఇచ్చింది. మరోవైపు ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్​ సైతం దాఖలైంది.

Read Also: రోడ్ టెర్రర్: గంటకు 20.. రోజుకు 485 మంది!

Follow Us On : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>