హిల్ట్ (HILT) పాలసీపై బీఆర్ఎస్ పోరాటం ఉదృతం చేసింది. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జీడిమెట్ల పారిశ్రామికవాడలో పర్యటించి కార్మికులతో మాట్లాడారు. హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని కార్మికులకు వివరించారు. పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు. ‘బీఆర్ఎస్(BRS) పార్టీతో ఏం అవుతుందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అనుకుంటున్నాడేమో.. అన్ని ప్రాంతాల్లో తిరుగుతాం ప్రజలను ఏకం చేస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. హిల్ట్ పాలసీపై రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలను కూడగడతామన్నారు. న్యాయపోరాటం చేసి ఈ కుంభకోణాన్ని అడ్డుకొని తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
పాలసీ లీక్ చేసింది నిజాయితీగల బిడ్డ..
హిల్ట్ పాలసీపై ప్రభుత్వం ప్రకటించకంటే ముందే లీక్ అయిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. అయితే లీకేజీపై కేటీఆర్ (KTR) స్పందిస్తూ.. ఎవరో నిజాయితీగల తెలంగాణ బిడ్డ లీక్ చేసి ఉంటారని.. ప్రభుత్వం ఎందుకు హైరానా పడుతుందని వ్యాఖ్యానించారు. లీక్ చేయడంలో తప్పేముందని వ్యాఖ్యానించారు. ఆరు నెలలుగా రేవంత్ రెడ్డి, అతని తమ్ముళ్లు ఈ భూములకు అగ్రిమెంట్ చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ 9,300 ఎకరాల ప్రజల ఆస్తిని పారిశ్రామికవేత్తలకు అన్యాయంగా కట్టబెడుతుంటూ చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ పాలసీని కచ్చితంగా రద్దు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌లో హమాలీలతో కేటీఆర్ మాట్లాడారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తదితరులు ఉన్నారు.
Read Also: నాకు సానుభూతి అక్కర్లేదు.. రాజ్ నిడుమోరు మాజీ భార్య కామెంట్
Follow Us On: WhatsApp Channel


