కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ పవన్(Pawan Kalyan) చేసిన కామెంట్లపై పెద్ద రచ్చ జరుగుతోంది. తాజాగా దీనిపై వైఎస్ షర్మిల(YS Sharmila) రియాక్ట్ అయ్యారు. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడటం చాలా బాధాకరం అన్నారు. ఇలాంటి మాటల వల్ల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. అన్నదమ్ముల్లా కలిసున్న రెండు రాష్ట్రాల నడుమ ఇలాంటి వైషమ్యాలు సృష్టించొద్దన్నారు. పవన్ కామెంట్లు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఇలాంటి మూఢ నమ్మకాలను వ్యాప్తి చేయడం కరెక్ట్ కాదు. శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోవడం వల్లే సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతున్నాయి. వాటికి తగిన చర్యలు తీసుకోకుండా దిష్టి తగిలిందని చెప్పడం ఏంటి. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలి. అంతేగానీ దిష్టి పేరుతో ప్రజలను కించపరచొద్దు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టండి’ అని తెలిపారు షర్మిల(YS Sharmila).
Read Also: దీపిక పదుకొణెకు రానా కౌంటర్
Follow Us On: Pinterest


