ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు(Maoists) హతమయ్యారు. భద్రతా బలగాలు బీజాపూర్(Bijapur) అటవీ ప్రాంతంలో ముమ్మర కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరపడంతో తాము ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లు ముందుగానే ఇంటెలిజెన్స్ ఇచ్చిన నేపథ్యంలో, ప్రత్యేక దళాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. బీజాపూర్, సుక్మా, దంతేవాడ ప్రాంతాలను భద్రతాబలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. మావోయిస్టుల(Maoists) కదలికలు ఉన్నట్టు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుంటున్నాయి. మరోవైపు వరస ఎన్ కౌంటర్లు, కీలక నేతల కాల్పుల్లో మరణిస్తుండటంతో మావోయిస్టులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు చిక్కుతున్నట్టు తెలుస్తోంది.
Read Also: సంచార్ సాథీ.. ఒక్కరోజులోనే 10 రెట్లు పెరిగిన డౌన్‌లోడ్లు
Follow Us On: X(Twitter)


