ఇటీవల పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దేవుళ్లపై చేసిన కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. రేవంత్ చేసిన కామెంట్లపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. బీజేవైఎం కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. రేవంత్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ఈ వివాదంపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ అంతర్గత సమావేశంలో చేసిన కామెంట్లను కట్, ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఓటమిని జీర్ణించుకోలేకే..
జూబ్లీహిల్స్ లో బీజేపీ ఘోర పరాజయం పాలవ్వడంతో బీజేపీ ఈ తప్పుడు ప్రచారం చేస్తోందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. తన పేరు ఉత్తరభారతదేశంలో సైతం మార్మోగేటట్లు బీజేపీ నేతలు చేశారని పేర్కొన్నారు. తనను దేశవ్యాప్తంగా పాపులర్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎం చేసిన కామెంట్లపై మొదట బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా విమర్శలు చేసింది. అనంతరం బీజేపీ కూడా అందుకున్నది. ఏకంగా బీజేవైఎం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు నివ్వడంతో ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల పేర్కొన్నారు.
Read Also: ముస్లిం మహిళలు పెళ్లి కానుకలు వెనక్కి తీసుకోవచ్చు: సుప్రీం
Follow Us On: X(Twitter)


