పెళ్లి సమయంలో తాము భర్తకు అందజేసిన కానుకలను వెనక్కి తీసుకొనే హక్కు విడాకులు పొందిన ముస్లిం మహిళల (Muslim Women)కు ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21.. మహిళల గౌరవం, సమానత్వం కల్పిస్తోందని, దానికి అనుగుణంగా మిగిలిన చట్టాలు పనిచేయాలని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ మహిళ 2011లో తన భర్త నుంచి విడాకులు పొందింది. పెళ్లి సమయంలో భర్తకు/వరుడి కుటుంబానికి తన తండ్రి ఇచ్చిన రూ.7లక్షల నగదు, బంగారు ఆభరణాలు వెనక్కి ఇవ్వాలంటూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.
అయితే, పెళ్లి తంతు జరిపించిన ఖాజీ నమోదు చేసిన వివరాలకు, వధువు తండ్రి చెప్పిన వివరాలకు మధ్య చిన్న వ్యత్యాసం ఉండడంతో హైకోర్టు ఈ కేసును తిరస్కరించింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సుప్రీం పై విధంగా వ్యాఖ్యానించింది. విడాకులు పొందిన ముస్లిం మహిళల (Muslim Women)కు తాము పెళ్లి సమయంలో భర్తకు ఇచ్చిన కానుకలను తిరిగి తీసుకునే హక్కు ఉందని చెప్పడంతోపాటు, ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ డైవోర్స్) యాక్ట్ 1986ను.. రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన ఆర్టికల్ 21 యాక్ట్‌కు అనుగుణంగా పాటించాలని సూచించింది.
Read Also: పవన్… జాగ్రత్తగా మాట్లాడు… కవిత కౌంటర్
Follow Us On: Instagram


