దీపిక పదుకొణె (Deepika Padukone) కు హీరో రానా (Rana) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ మీద ఎప్పటి నుంచో రచ్చ జరుగుతోంది. ఈ వర్కింగ్ అవర్స్ వచ్చినప్పుడల్లా దీపిక పేరే వినిపిస్తుంది. 8 గంటల కంటే ఎక్కువ వర్క్ చేయొద్దని ఆమె ఎప్పటి నుంచో చెబుతుంది. ఆ కండీషన్లతోనే కల్కీ, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు కూడా. ఆమెకు కొందరు సపోర్ట్ చేస్తుంటే ఎక్కవ మంది ఏకిపారేస్తున్నారు. తాజాగా హీరో రానా దీపిక పేరెత్తకుండానే కౌంటర్ ఇస్తూ మాట్లాడాడు. సినిమా ఇండస్ట్రీ అనేది మిగతా రంగాలకంటే డిఫరెంట్ గా ఉంటుంది.
ఇక్కడ 8 గంటలు మాత్రమే పనిచేస్తే అదిరిపోయే ఔట్ పుట్ రాదు. నటీనటులు తమ లైఫ్ స్టైల్ గా దీన్ని మార్చుకోవాలి. అంతేగానీ జాబ్ లాగా చూస్తే పనికిరారు. కేవలం నటనమీదే కాకుండా అన్ని కేటగిరీల్లో భాగం అయితేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అద్భుతమైన సినిమాలు బయటకు వస్తాయి. సినిమా ఇండస్ట్రీ అనేది జాబ్ కాదు. కండీషన్లు పెట్టుకుంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు అన్నారు రానా. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దీపిక పదుకొణె (Deepika Padukone) కి కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. కాగా, రీసెంట్ గానే కాంత సినిమాలో నటించాడు భళ్లాల దేవుడు. ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
Read Also: పవన్… జాగ్రత్తగా మాట్లాడు… కవిత కౌంటర్
Follow Us On: X(Twitter)


