epaper
Tuesday, November 18, 2025
epaper

తిలక్ వర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

కలం డెస్క్ : Tilak Varma భారత్-పాక్ మధ్య జరిగిన ఆసియా కప్-2025 ఫైనల్‌లో గేమ్‌ఛేంజర్‌ ఎవరంటే అందరూ చెప్పే పేరు ‘తిలక్ వర్మ్’. అందరూ తమ ఆశలను అభిషేక్ శర్మపై పెట్టుకున్నారు. అనూహ్యంగా అభిషేక్ స్టార్టింగ్‌లోనే ఔట్ అయి పెవిలియన్ చేరుకోగా.. ఆ తర్వాత టీమిండియాకు గెలుపు ఊపిరి ఊదింది తిలక్ వర్మే. 56 బంతుల్లో 107 పరుగులు చేసి పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

తిలక్ వర్మ క్రీజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సెటిల్డ్‌గా రాణించాడు. అవకాశం చూసుకుని బౌండరీలు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. తనదైన శైలి ఆటతో పాక్ బౌలర్ల చేత మూడు చెరువుల నీళ్లు తాగించాడు. టీమిండియాకు ఆసియా కప్ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ ఆటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు తిలక్ వర్మ జపమే చేస్తోంది. అయితే చాలా మందికి తిలక్ వర్మ అంటే తెలుగు ఆటగాడనే తెలుసు. కానీ, అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియవు. మరి అవేంటో తెలుసుకుందామా.

1. తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. 2 నవంబర్ 2022న హైదరాబాద్‌లో జన్మించాడు.
2. అతని తండ్రి నంబూరి నాగరాజు.. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తిలక్‌కు క్రికెట్ ఆడటంలో పూర్తి ప్రోత్సాహం అందించారు.
3. తిలక్ వర్మ ‘వినాయకుడి’ని అమితంగా నమ్ముతాడు. దాదాపు ప్రతి మ్యాచ్ ముందు వినాయకుడికి దండం పెట్టుకునే వస్తాడు.
4. ప్రస్తుతం తిలక్.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు.
5. క్రికెట్ అంటే తిలక్‌కు ఉన్న ఇష్టం, ప్యాషన్‌ను చూసి కోచ్ సలీమ్ బాయాష్.. అతనిని తన వింగ్‌లోకి తీసుకున్నారు.
6. తిలక్‌కు పదేళ్లు ఉన్నప్పటి నుంచే సలీమ్ తన కోచింగ్ స్టార్ట్ చేశారు.
7. తిలక్‌కు కోచింగ్ ఇప్పించడం కోసం సలీమ్ ప్రతిరోజూ 40 కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు.
8. తిలక్ వర్మ్‌.. క్రికెట్‌లో సురేష్‌ రైనాకు భారీ ఫ్యాన్
9. 2018-19లో జరిగిన రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున తిలక్ తన ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు.
10. T20I ల్లో సెంచరీ బాదిన యంగెస్ట్‌ ప్లేయర్స్‌ జాబితాలో తిలక్ రెండో స్థానంలో ఉన్నాడు.
11. తిలక్‌ వర్మకు ఓ పెంపుడు కుక్క కూడా ఉంది. దాని పేరు ‘ట్రిగ్గర్’

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>