కలం డెస్క్ : Dussehra Donations | భారతదేశంలోని ప్రతి రాష్ట్రం అంగరంగవైభవంగా జరుపుకునే అతితక్కువ పండుగల్లో దసరా కూడా ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. దసరా పండగను తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలుగా జరుపుకుంటారు. దసరా రోజున దేవి దుర్గామాతను పూజించడం, విరాళాలు ఇవ్వడం, సత్సంకల్పాలతో కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. ఆయుధ పూజ కూడా చేస్తారు. అయితే దసరా రోజుల కొన్ని దానాలు చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చని పెద్దలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా దసరా రోజున ఈ దానాలు చేసిన వారిని అదృష్టదేవత అనుగ్రహిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతకీ ఆ దానాలు ఏంటో తెలుసా..
దుస్తులు
ఏ దానం చేసినా పుణ్యమే వస్తుంది. అయితే దసరా రోజున పసుపు రంగు వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేస్తే వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. పసుపు రంగు శుభానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే పసుపు రంగు దుస్తులను దానం చేయడం ద్వారా చేస్తున్న వృత్తిలో పురోగతి లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే విధంగా తెలుపు రంగు వస్త్రాలను దానం చేయడం ద్వారా కుటుంబంలో శాంతి, ఆరోగ్యం పెరుగుతాయిని చెప్తారు.
ఆహారం
చేసిన దానాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచాలి అని పెద్దలు చెప్తారు. దసరా పండుగ నాడు.. అవసరం ఉన్న వారికి ఆహారం, దుస్తులు, కొబ్బరికాయలు దానం చేయడం మేలు జరుగుతందని పెద్దులు చెప్తున్నారు. వీటిని దానం చేయడం ద్వారా స్నేహం, మాధుర్యం, ఐక్యతను పెంచుతాయి. పేదరికం, కుటుంబ కలహాలను తగ్గిస్తాయి.
ధాన్యాలు
దసరా రోజున బ్రాహ్మణులకు గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలు దానం చేయడం కూడా శుభపరిణామాలు కలిగిస్తాయి. వీటిని దానం చేయడం ద్వారా వృత్తిలో విజయాలు, గృహంలో ఆనందం పెరుగుతుంది. అదే విధంగా పెసరపప్పు దానం చేయడం ద్వారా వ్యాపార వృద్ధి, ఆరోగ్యం పెరుగుతాయి.
దసరా రోజున అవసరం ఉన్న వారికి వారి అవసరాలను తీర్చేలా ఏది దానం చేసినా అది మంచి ఫలితాలను అందిస్తుంది. స్వచ్ఛమైన మనసుతో చేసే ఏ దానమైనా శుభపరిణామాలను కలిగిస్తుందని శాస్త్రం చెప్తోంది. దానం చిన్నదే అయినా స్వచ్ఛమైన మనసుతో చేస్తే ఫలితం పెద్దగా ఉంటుందని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి.

