తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ఈవెంట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ (PM Modi)ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీని కలుసుకొని ఆహ్వానపత్రం అందజేశారు. అనంతరం ఆయన రాహుల్ గాంధీని, పలువురు కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా సీఎం ఆహ్వానించారు.
మరి ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరవుతారా? లేదా? అన్నది వేచి చూడాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈవెంట్ కు ప్రధాని వస్తారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇక ఇదే సమ్మిట్ కు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆహ్వానించారు. మరి ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఒకే సమ్మిట్‌కు వస్తారా? అన్నది అనుమానమే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇటీవల రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం తమకు నిధులు ఇవ్వడం లేదని, పలు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం లేదని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని భూస్థాపితం చేస్తామని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని వస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.


