రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ (Global Summit)కు ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళారు. ప్రధాని మోడీని బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఛాంబర్‌లోనే కలిసి తెలంగాణ విజన్ – 2047 డాక్యుమెంట్ (Telangana Vision – 2047) ఆవిష్కరణ జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఇన్విటేషన్ అందజేసి ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్, పియూష్ గోయల్ తదితరులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేయనున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిజీ షెడ్యూలులో ఉన్నందున అవకాశాన్ని బట్టి సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అయ్యే అవకాశమున్నది. హైదరాబాద్ శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ముగింపు రోజున ప్రధాని సహా పలువురు హాజరుకానున్నారు. సీఎంరేవంత్‌రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కూడా ఢిల్లీ పర్యటనలో జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులను కూడా గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. కేవలం ఆహ్వానం అందించడానికి మాత్రమే వీరి ఢిల్లీ పర్యటన పరిమితం కానున్నది. తిరిగి మధ్యాహ్నానికే హైదరాబాద్‌కు రిటన్ కానున్నారు.
Read Also: సర్పంచ్‌లుగా మంచోళ్లను ఎన్నుకోండి : సీఎం రేవంత్
Follow Us On: instagram


