తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Summit)ను భారీగా స్థాయిలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఈవెంట్కు ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ(PM Modi), కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఆహ్వానించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయి ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకులు, నిపుణులు, పరిశ్రమల ప్రముఖులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)లకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆహ్వానం అందించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వాన పత్రాలు పంపనుంది.
ఇప్పటికే సుమారు 4,500 మందికి ఆహ్వానాలు పంపినట్లు, అందులో వెయ్యి మంది తమ హాజరును నిర్ధారించారని ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.
మొత్తం ప్రపంచ దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఈ సమ్మిట్(Telangana Rising Summit) సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
Read Also: మెస్సీతో పోరాటానికి రేవంత్ ప్రాక్టీస్
Follow Us On: X(Twitter)


