కలం, వెబ్ డెస్క్ : మంగళగిరి (Mangalagiri) లోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం (World Wildlife Day) ఘనంగా జరగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ అటవీ శాఖ కార్యకలాపాలను బలపరిచేందుకు డిప్యూటీ సీఎం.. వాహనాలు, అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ వాహనాలు, అంబులెన్స్‌లు హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ద్వారా అటవీ శాఖకు అందజేయబడినవి.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత అని తెలిపారు. వన్యప్రాణుల రక్షణకు అవసరమైన పరికరాలు, వాహనాల కల్పన వంటి చర్యలు ఈ దిశలో కీలకంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, పర్యావరణ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజలలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

