epaper
Monday, March 2, 2026
epaper

మంజుమ్మెల్​ బాయ్స్​ డైరెక్టర్​పై లైంగిక వేధింపుల కేసు

కలం, వెబ్​ డెస్క్: లైంగిక వేధింపుల కేసులో మంజుమ్మెల్​ బాయ్స్ (Manjummel Boys)​ డైరెక్టర్​ చిదంబరం ఎస్​ పొడువాల్​పై కేసు నమోదు అయింది. తన ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించడమే కాకుండా, లైంగిక దాడికి యత్నించాడంటూ ఆయనపై ఓ నటి కేసు పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నటి, చిదంబరం 2022లో ఒకే అపార్ట్​మెంట్​లో ఉండేవాళ్లు. ఆ క్రమంలో ఒకరోజు నటి ఇంట్లోకి ప్రవేశించిన చిదంబరం, ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. దీనిపై ఆమె ఆదివారం ఎర్నాకుళం పోలీస్​ స్టేషన్​ కేసు పెట్టింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు భారత న్యాయ సంహిత ప్రకారం అత్యాచారయత్నం, లైంగిక వేధింపుల కేసు పెట్టారు. విచారణ అనంతరం చిదంబరంను ఏ క్షణంలో అయినా అరెస్ట్​ అవకాశముంది.

కాగా, నిజజీవిత సంఘటనల ఆధారంగా 2024లో వచ్చిన మంజుమ్మెల్​ బాయ్స్(Manjummel Boys) సినిమా మలయాళంలో రికార్డు విజయాన్ని అందుకుంది. అడవుల్లో పర్యటనకు వెళ్లిన ఓ బృందంలోని సభ్యుడు అక్కడ 800 అడుగుల లోతులోని లోయలోకి పడిపోతాడు. అతడిని రక్షించే ప్రయత్నంపై తీసిన సినిమానే మంజుమ్మెల్​ బాయ్స్​. చిదంబరం(Chidambaram S. Poduval) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్​లో మంచి వసూళ్లు కూడా రాబట్టింది.

Read Also: హోళీలో ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు.. ఎస్పీ వార్నింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!