రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో ‘స్పిరిట్(Spirit)’ రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా చిరంజీవి ఫస్ట్ క్లాప్ కొట్టడంతో అధికారికంగా షూటింగ్‌ను స్టార్ట్ చేసుకుంది. షూటింగ్ తొలి షెడ్యూల్‌ను సందీప్.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేస్తుంది. దీని కోసం భారీ సెట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. గురువారం సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. భారీ ఫైట్‌తో ‘స్పిరిట్’ను స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ను నెవ్వర్ బిఫోర్ లుక్స్‌లో కనిపిస్తాడని ఇప్పటికే అర్థమైపోయింది. అందులోనూ సందీప్ లాంటి బోల్డ్ డైరెక్టర్ అంటే.. ప్రభాస్ యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని అభిమానులు అంచనాలు వేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు స్పెషల్ సెట్స్‌లో ఫైట్ సీక్వెన్స్‌లు అన్న వార్తలు వారి అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్తున్నాయి.
అయితే ఈ సినిమా(Spirit)లో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి నటిస్తోంది. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని టీ–సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
Read Also: ఓటీటీ యాక్సెస్‌కి ఆధార్ లింక్.. సీజేఐ కీలక సూచన
Follow Us on: Youtube


