epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఓటీటీ యాక్సెస్‌కి ఆధార్ లింక్.. సీజేఐ కీలక సూచన

ఓటీటీ(OTT)లలో కంటెంట్ యాక్సెస్‌కు ఆధార్‌ను లింక్ చేయాలంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant) సూచించారు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లలో కూర్చుని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నారు. కాగా సాధారణ సినిమాలు, షోలతో పోలిస్తే ఓటీటీల్లో అశ్లీలత, పరుష పదజాల వినియోగం అధికంగా ఉంటుంది. వాటిని చిన్న పిల్లలు, కుటుంబీకులతో కలిసి చూడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది. ఈ సందర్భంగానే అత్యున్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది. ఓటీటీల్లో కంటెంట్ యాక్సెస్‌ను ఆధార్‌లోని వయసు ద్వారా విభజించాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మల్య బాగ్చి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అశ్లీల కంటెంట్ విషయంలో కొన్ని సూచనలు చేసింది. ‘పుస్తకం, పెయింటింగ్ మొదలైన వాటిలో అశ్లీలత ఉండవచ్చు. ఆ విషయాన్ని ముందుగానే చెబుతారు. కానీ, మీరు ఫోన్ ఆన్ చేసిన వెంటనే మీరు కోరుకోనిది, అశ్లీలమైనది ఏదైనా వస్తే, అప్పుడు ఏమి చేయాలి’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఓటీటీ షోల ప్రారంభంలో సాధారణ హెచ్చరికలు ఉన్నప్పటికీ, అదనపు చర్యగా వయసు ధృవీకరణ కూడా చేయొచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant) పేర్కొన్నారు. కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన ‘యంగ్ ఇండియా టాలెంట్’ షోలో తల్లిదండ్రులు, శృంగారంపై మరో యూట్యూబర్ రణ్‌వీర్‌ అలహాబాదియా చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపాయి. వీటిపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగానే ఆన్‌లైన్ కంటెంట్‌పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పునరుద్ఘాటించింది.

Read Also: ‘హాంకాంగ్’ దుర్ఘటన.. ‘స్టైరోఫోమ్’ వల్లే తీవ్రస్థాయి మంటలు?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>