epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై రేప్ కేసు

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై రేప్ కేసు నమోదైంది. కేరళ(Kerala) రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌కుటత్తిల్‌(Rahul Mamkootathil)పై వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే తన మీద లైంగికదాడి చేశాడని.. ఓ యువతి నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్‌తో కొంతకాలంగా తనకు పరిచయం ఉన్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరి మధ్య సంబంధం కొనసాగిన తర్వాత, తనపై లైంగిక దాడి జరిగిందని, తాను గర్భం దాల్చానని.. ఆబార్షన్ చేయించుకోవాలని రాహుల్‌ బలవంతం చేశారని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందుకు అంగీకరించకపోతే బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. బాధితురాలు అందించిన ఆధారాలు, వాట్సాప్‌చాట్‌లు, ఇతర ఫొటోలు, వీడియోల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఎమ్మెల్యే స్పందన ఇదే..

తనపై పెట్టిన కేసు పూర్తిగా కుట్రపూరితమైనదని, తాను ఏ తప్పూ చేయలేదని ఎమ్మెల్యే రాహుల్(Rahul Mamkootathil) చెప్పుకొచ్చారు. ప్రజల ముందూ, న్యాయస్థానం ముందూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో రాహుల్‌పై మరో వివాదం దుమారం రేపిన సంగతి తెలిసిందే. నటి రీని జార్జ్‌ ఓ ఇంటర్వ్యూలో పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ప్రముఖ పార్టీకి చెందిన ఓ యువనేత మూడేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఆ ఆరోపణల తర్వాత బీజేపీ, సీపీఎం నాయకులు రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. రాహుల్‌ మామ్‌కుటత్తిల్‌ పాలక్కాడ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి ఈ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Read Also: ఆయుధాలు వదిలేస్తాం.. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

Follow US On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>