కలం, వెబ్ డెస్క్ : రేపు(సోమవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వికారాబాద్ (Vikarabad) జిల్లాలో పర్యటించనున్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తో కలిసి వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరిగే ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. అనంతరం రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి నేరుగా వికారాబాద్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు.
Read Also: గల్ఫ్ లో హై టెన్షన్.. తెలంగాణ వలసజీవులు బిక్కుబిక్కు
Follow Us On: Instagram

