LIC కస్టమర్లకు బిగ్ షాక్.. ఇక నుంచి ఈ పేమెంట్ ఆప్షన్ ఉండదు!

కలం, వెబ్ డెస్క్: లైఫ్​ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా (LIC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీ పాలసీల చెల్లింపు విషయంలో తన ఖాతాదారులకు (LIC Policyholders) బ్యాడ్ న్యూస్ అందించింది. సాధారణంగా ఎల్ఐసీ పాలసీలు తీసుకున్నవారు ప్రతీనెలా లేదా 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లిస్తుంటారు. అయితే చాలామంది క్రెడిడ్ కార్డు (Credit Card) ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. అయితే ఈ సౌకర్యాన్ని ఎల్ఐసీ పూర్తిగా తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

ఎల్ఐసీ పాలసీలు తీసుకున్నవారు ఆఫ్​‌లైన్‌లో ఎల్ఐసీ కార్యాలయాల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. లేదా ఆన్‌లైన్ ద్వారా అంటే ఎల్ఐసీ పోర్టల్, వెబ్‌సైట్, యూపీఐ యాప్స్ ద్వారా చెల్లించవచ్చు. ఇవే కాకుండా నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు విధానాల్లో కూడా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. అయితే చాలామంది క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లింపులు చేస్తుంటారు. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే పేమెంట్లకు కస్టమర్లకు రివార్డు పాయింట్లతో పాటు ఆఫర్లు కూడా ఉంటాయి.

అయితే తన ఖతాదారులకు షాక్ ఇస్తూ ఎల్ఐసీ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలను నిలిపివేసింది. గత 15 రోజుల క్రితమే క్రెడిట్ కార్డు పేమెంట్స్ ఆప్షన్ తొలగించింది. కాబట్టి ఖాతాదారులు ఇకనుంచి క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్స్ చేయలేరు. ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. ఫీజుల భారం ఎక్కువ కావడం. అయితే ఇప్పటి వరకు ఎల్ఐసీ వెబ్ సైట్, యాప్‌లో క్రెడిట్ కార్డు ద్వారా ప్రీమియం చెల్లిస్తే ఎల్ఐసీనే గేట్ వే, కన్వీనియన్స్ ఛార్జీలు కస్టమర్ల తరఫున భరించేది. కానీ ఎక్కువ మంది క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తుండటంతో ఎల్ఐసీకి ఫీజులు భారం ఎక్కువ అవుతుందని, అందుకే క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లలో చేసుకోవచ్చు

కేవలం ఎల్ఐసీ వెబ్‌సైట్, పోర్టల్‌లో పూర్తిగా తొలగించామని, మిగతా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎప్పటిలాగే చేసుకోవచ్చని సూచించింది. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి యూపీఐ యాప్స్ లేదా ఇతర థర్డ్–పార్టీ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఎప్పటిలాగే ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చని సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ యాప్స్‌లో విధించే అదనపు ఫ్లాట్‌ఫామ్ లేదా కన్వీనియన్స్ ఛార్జీల భారాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.

ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రీమియం చెల్లించాలనుకుంటే వినియోగదారులు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అక్కడ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా నేరుగా యూపీఐ యూపీఐ ఆప్షన్ల ద్వారా పేమెంట్ చేస్తే ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, థర్డ్-పార్టీ యాప్స్‌లో పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించే సమయంలో ఆయా ప్లాట్‌ఫామ్స్ ఎండీఆర్ (MDR – Merchant Discount Rate) ఛార్జీలను విధిస్తుంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>