Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీస్ పెట్రోల్‌బంక్ ప్రారంభించిన డీజీపీ

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) పోలీస్ కమిషనరేట్ మడికొండలోని పోలీస్ శిక్షణా కేంద్రం ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పెట్రోల్ బంక్ ను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఆదివారం ప్రారంభించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వాహనాల నిర్వహణలో సౌలభ్యం కల్పించడం లక్ష్యంగా ఈ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన వాహనాల పెట్రోల్, డీజిల్ అవసరాలను ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా తీర్చనున్నట్లు వెల్లడించారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో అత్యాధునిక సదుపాయాలతో ఈ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal CP) సన్ ప్రీత్ సింగ్, సెంట్రల్ జోన్ డీసీపీలు కవిత, అంకిత్ కుమార్, ఏ.ఎస్పీ శుభం, అదనపు ఏసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఏసీపీ అంతయ్య, సురేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Also: రేపు సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ పర్యటన

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>