కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియా, వెస్టిండీస్ మధ్య ఉత్కంఠ పోరు జరుగుతోంది. ఈ గేమ్‌లో భారత్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. స్పిన్ కిల్లర్ హిట్‌మెయర్ వికెట్ పడిన వెంటనే చేజ్ కూడా ఔట్ కావడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి వికెట్లనూ బుమ్రానే తీశాడు. క్రీజులో సెటిల్ అయ్యి ప్రమాదకరంగా మారుతున్న షిమ్రాన్ హెట్మెయర్ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ 11.3 బంతికి సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చిన ఈ హార్డ్ హిట్టర్ వెనుదిరిగాడు. అనంతరం అదే ఓవర్ ఐదో బంతికి సూర్యకుమార్ క్యాచ్ ద్వారా బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. హెట్‌మెయర్ కేవలం 12 బంతుల్లోనే 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 27 పరుగులు చేశాడు. ఛేజ్ 20 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్‌తో 40 పరుగులు చేశాడు. ధాటిగా ఆడుతున్న వీళ్లిద్దరూ అవుట్ అవ్వడం భారత బౌలర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
ప్రస్తుతం వెస్టిండీస్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో రూథర్‌ఫోర్డ్, పావెల్ ఉన్నారు. ఈ మ్యాచ్ ఇండియా, విండీస్ రెండు జట్లకూ అత్యంత కీలకం. ఇందులో గెలిచిన జట్టు సెమీస్‌కు వెళ్తుంది(T20 World Cup).
Read Also: యాదాద్రిలో ఘోరం.. సుత్తితో కొట్టి భర్తను చంపిన భార్య
Follow Us On: Pinterest

