బీరు కూలింగ్ పేరుతో దోపిడి.. ఏకంగా CMకి కంప్లైంట్

కలం, వెబ్ డెస్క్: అవినీతిపై రాజీలేని పోరాటం చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) ఇచ్చిన పిలుపునకు ఒక యువకుడు వెంటనే స్పందించాడు. ఒక ప్రభుత్వ వైన్ షాపులో జరుగుతున్న అక్రమాలను సాక్ష్యాలతో సహా ఎండగట్టాడు. సదరు షాపులో రూ. 160 విలువైన బీరును, నిర్ణీత ధర కంటే అదనంగా రూ. 10 ‘కూలింగ్ ఛార్జ్’ పేరిట కలిపి మొత్తం రూ. 170 వసూలు చేయడాన్ని ఆ యువకుడు నిలదీశాడు. ఈ మొత్తం తతంగంపై అక్కడికక్కడే వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియా వేదికగా నేరుగా సీఎం విజయ్‌కు ట్యాగ్ చేశాడు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వినియోగదారులను దోచుకుంటున్న ఆ వైన్ షాప్ కాంట్రాక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆ యువకుడు ముఖ్యమంత్రిని కోరాడు. ప్రస్తుతం ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>