epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

స్మృతి మందానా కోసం జెమీమా కీలక నిర్ణయం

భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానా కోసం టీమిండియా ప్లేయర్ జెమీమా రోడ్రిక్స్(Jemimah Rodrigues) కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23న ఆదివారం పెళ్లి పీటలెక్కాల్సిన స్మృతి.. తండ్రి అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర ఆందోళనలో ఉంది. ఆమె పెళ్లి వాయిదా పడింది. ఈ కష్ట సమయంలో తన స్నేహితురాలికి తోడుగా, మద్దతుగా నిలవాలని జెమీమా డిసైడ్ అయింది. అందుకే ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని బ్రిస్బేన్ హీట్ జట్టు స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మృతి మందానాకు మద్దతుగా నిలవడం కోసం జెమీమా తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని జట్టు యాజమాన్యం తెలిపింది. జెమీమా తీసుకున్న నిర్ణయానికి అభిమానులు హాట్సాఫ్ చెప్తున్నారు.

నవంబర్ 9న మహిళల బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ మొదలయింది. ఇందులో బ్రిస్బేన్ హీట్ జట్టుకు జెమీమా కెప్టెన్‌గ వ్యవహరిస్తోంది. కాగా స్మృతి మందానా(Smriti Mandhana) వివాహ వేడుకల్లో పాల్గొనడం కోసం జెమీమా(Jemimah Rodrigues).. పది రోజుల క్రితం భారత్‌కు వచ్చింది. ఇంతలోనే అనివార్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది. ఈ సమయంలో స్మృతికి తోడుగా ఉండటం కోసం ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న జెమీమా.. బిగ్‌బాష్ ‌లీగ్‌కు దూరమైంది.

Read Also: ఆధార్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>