కలం, వెబ్ డెస్క్ః ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని (Vetlapalem) బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. కాగా, శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనం అయ్యారు. మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలి: సీఎం రేవంత్
Follow Us On: Youtube

