కలం, వెబ్ డెస్క్: కోకాపేటలో శారదా పీఠానికి (Sharada Peetham) కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం సమావేశమయ్యారు.
కోకాపేట (Kokapet) భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై మండిపడ్డారు. జల మండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని పీఠం ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచించారు.
Read Also: బయటపడిన మావోయిస్ట్‌ల నగదు డంప్
Follow Us On : WhatsApp

