Mobile Popup Ad
Mobile Popup Ad

వేట్లపాలెం దుర్ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

క‌లం, వెబ్ డెస్క్ః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ జిల్లా సామ‌ర్ల‌కోట మండ‌లం వేట్ల‌పాలెంలోని (Vetlapalem) బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో జ‌రిగిన పేలుడు దుర్ఘ‌ట‌న‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు ప్రాణాలు కోల్పోవ‌డం దురదృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన‌వాళ్లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సీఎం రేవంత్‌ ఆకాంక్షించారు. కాగా, శ‌నివారం ఉద‌యం జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 21 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మ‌రో 15 మంది తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Read Also: పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలి: సీఎం రేవంత్

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>