epaper
Sunday, March 1, 2026
epaper

నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  శనివారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. గతంలో నమోదైన రెండు వేర్వేరు కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరై కోర్టు ప్రక్రియలో పాల్గొన్నారు.

2021లో కోవిడ్‌ మహమ్మారి సమయంలో అమల్లో ఉన్న నియమావళి ఉల్లంఘనకు సంబంధించినది. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన పరిమితులను పాటించకుండా నిర్వహించిన ఒక పబ్లిక్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెండో కేసు 2019 హుజుర్‌నగర్ ఉపఎన్నికల సమయంలో చోటుచేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించగా, అనుమతి పరిమితులను అతిక్రమిస్తూ సుమారు 40 కార్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లతో ప్రచారం నిర్వహించారని ఎన్నికల సంఘం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, ప్రస్తుతం ఆ కేసుల విచారణ కోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.

Read Also: KFCలో కుళ్లిపోయిన చికెన్.. కస్టమర్స్ సీరియస్

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!